TG: బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని దాడి చేసిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. కర్నూల్ నుంచి గద్వాలకు వస్తున్న ఆర్టీసీ బస్సు టౌన్లోకి రాగానే వెనకాలే బైక్‌పై మద్యం సేవించి వస్తున్న ఇద్దరు యువకులు బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. సైడ్ ఇవ్వకపోవడంతో బస్సును ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. డ్రైవర్ చెవిలోంచి రక్తం రావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.