TG: హైదరాబాద్లోని తమ నివాసం బఫర్ జోన్లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మధురానగర్లో తాము ఉంటున్న నివాసం 4 దశాబ్ధాల ముందు వాళ్ల నాన్న నిర్మించారని తెలిపారు. కానీ కొందరు బఫర్ జోన్లో ఉందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కట్టకు కిలోమీటర్ దూరంలో తమ నివాసం ఉందని చెప్పారు.