కృష్ణా: నూజివీడు మండలం బత్తులవారిగూడెం ఎస్సీ కాలనీ వద్ద ఆర్ అండ్ బీ రహదారిపై అగాధం ఏర్పడింది. దీంతో నూజివీడు-మైలవరం రహదారిలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోయారు. భారీ గొయ్యి మోకాలికిపైగా లోతు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నామన్నారు. అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని వారు కోరుతున్నారు.