ప్రకాశం: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని కార్పెంటర్ల ట్రైనీ దిలీప్ తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన కింద ఒంగోలులోని మంగమూరు రోడ్డులో 5రోజుల నుంచి కార్పెంటర్లు, చేతివృత్తుల వారికి శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ దిలీప్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను తమ అభివృద్ధికి వాడుకోవాలని హితవు పలికారు. అలా కాకుండా సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు అన్నారు.