TG: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో మరో 8 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. 8 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లగచర్ల ఘటనపై డీజీ మహేశ్ భగవత్ వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.