JN: జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారు వద్ద శుక్రవారం రాత్రి అతి వేగంతో కల్వర్టుని ఢీ కొట్టి కారు పల్టీ కొట్టిన సంఘటన శనివారం బయటపడింది. పల్టీ కొట్టిన కారును వదిలేసి వెళ్లిన డ్రైవర్. కారు ఎవరిది, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.