ASR: అమలగుడకి వెళ్లే వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని డుంబ్రిగుడ మాజీ ఎంపీపీ దన్నేరావు డిమాండ్ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలగుడకి వంతెన నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ హయంలో వంతెన నిర్మాణానికి రూ.80లక్షలు మంజూరైనప్పటికీ వంతెన పనులు ప్రారంభించలేదని విమర్శించారు.