AP: విశాఖలో ఈనెల 29న ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. అనకాపల్లి సమీపంలోని పూడిమడకలో NDPC తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో బహిరంగ సభకు జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకు పీఎం పర్యటనపై అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.