AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నాందేడ్ జిల్లా డెంగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గంలో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ సభ, రాత్రి 6 గంటలకు షోలాపూర్ రోడ్ షోలో పాల్గొంటారు.