NRML: నిర్మల్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఫుడ్ సేఫ్టీ అధికారిణి ప్రత్యూష ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్లో గల ఎవర్గ్రీన్ స్వీట్ హోమ్, కేక్ బాక్స్ బేకరీ, ఆరెంజ్ బేకరీలలో తనిఖీలు చేపట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాలం చెల్లిన వస్తువులు విక్రయిస్తే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.