AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. 60 రోజుల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.