చాలా మంది రాత్రి వేళలో జుట్టుకు నూనె పెట్టుకొని ఉదయన్నే స్నానం చేస్తారు. అయితే, దీని వల్ల ఆయిల్లో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు వేర్లను బలపరుస్తాయి. కానీ, సున్నితమైన చర్మం ఉన్న వాళ్లు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. వీరు రాత్రి ఆయిల్ పెట్టుకోవడం వల్ల ముఖంపై మొటిమలు వచ్చే ఆవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారు తక్కువ మోతాదులో ఆయిల్ రాసుకోవాలని అంటున్నారు.