ప్రకాశం: జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు & దాబాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేని దుకాణదారులు, అక్రమ మద్యం అమ్మేవారి వివరాలు సేకరించారు.