AP: వైసీపీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం జిల్లా), బొడ్డేడ ప్రసాద్, (అనకాపల్లి జిల్లా) నియమితులయ్యారు.