VZM: జిల్లాలో రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన మరమ్మత్తు పనులన్నీ నవంబరు నెలాఖరులోగా ప్రారంభించాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 296 కిలోమీటర్ల మేరకు రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు 68 పనులు మంజూరైనట్టు కలెక్టర్ చెప్పారు.