గత కొన్నేళ్లుగా బ్రిటన్ ప్రధాని కార్యాలయం దీపావళి వేడుకలకు అతిధ్యం ఇస్తుంది. ఈసారి ఈ వేడుకలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం దీపాలు వెలిగించడం, సాంప్రదాయ నృత్యాలు చేయడం వంటి కార్యక్రమాల తర్వాత విందులో శాకాహార భోజనం వడ్డించాలి. కానీ వారు మద్యం, మాంసం వడ్డించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ఈ ఘటన పొరపాటున జరిగిందని, మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.