SKLM: మెలియాపుట్టి ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. గిరిజన వర్గాల అభ్యున్నతికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ అన్నారు. గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే బిర్స ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.