AP: ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్గా జీవీరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణ ప్రాంతాలకు ఏపీ ఫైబర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్ వర్క్(APSFL) సేవలను చేరువ చేస్తామని పేర్కొన్నారు. రెండేళ్లలో 50 లక్షల కేబుల్ కనెక్షన్లకు పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఛైర్మన్గా నియమించిన సీఎం చంద్రబాబుకు, మంత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.