TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ విమర్శల వర్షం గుప్పించారు. కేటీఆరే దాడులు చేయించి, పరువు పోకుండా రైతులను పరామర్శిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమన్నారు. రైతులపై కేసులు పెట్టలేదని, దాడికి ఉసిగొల్పిన రౌడీమూకలపైనే కేసులు పెట్టారని వెల్లడించారు. అధికారం కోసం దిగజారడం మంచిది కాదని, కేటీఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని అద్దంకి పేర్కొన్నారు.