చలికాలంలో ముల్లంగి ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల ముల్లంగిని రోజూ తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిని సలాడ్స్, పరాఠాలు, చట్నీల్లో తినవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. అందువల్ల రోజుకూ ఒక ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవాలి.