TG: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారికి అవసరమైన స్థలాలను లీజుకు ఇవ్వాలని, ఆర్థిక నిధులకోసం రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలన్నారు.