మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్ల ధరలు పెంచేందుకు రెడీ అయ్యింది. అన్ని మోడల్ కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే, డిసెంబర్ 31లోగా బుకింగ్ చేసుకునే వాహనాలకు ఈ పెంపు వర్తించదు. ప్రస్తుతం రూ.45 లక్షలు విలువైన ఏ క్లాస్ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్యూవీ వరకు అనేక రకాల వాహనాలను దేశీయంగా విక్రయిస్తోంది.