AP: తిరుమల శ్రీవారికి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విరాళంగా వచ్చాయి. ఈ స్కూటీలను హైదరాబాద్కు చెందిన పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విరాళమిచ్చింది. ఆ సంస్థ ఎండీ సి.వెంకట నాగరాజు వాహనాలను టీటీడీకి అందించారు. ఆ వాహనాలకు శ్రీవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు.