తన భార్య ఆర్తితో విడిపోతున్నానని తమిళ నటుడు జయం రవి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశారు. దీనిపై మద్రాస్ ఫ్యామిలీ కోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. కీలక సూచనలు జారీ చేసింది. ఒక్కసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని, రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపింది.