VSP: భీమిలి నుండి విశాఖ వరకు తీరం వెంబడి అక్రమంగా నిర్మించిన బార్ అండ్ రెస్టారెంట్లపై తక్షణమే చర్యలు తీసుకొని తీర ప్రాంతాన్ని కాపాడాలని భీమిలి మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా మత్స్యకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహరదీక్షలు రెండవరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి గంటా నూకరాజు మాట్లాడారు.