TG: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. నిజామాబాద్లో పసుపు బోర్డు, భద్రాద్రిలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. నిజామాబాద్ రైతులు పదేళ్లుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. పసుపుసాగు విస్తీర్ణం, ఎగుమతి అవకాశాలు పెరగడానికి పసుపుబోర్డు తప్పనిసరి అని పేర్కొన్నారు.