ELR: పెదపాడు శాఖా గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ వై.రాంబాబు ప్రారంభించారు. గ్రంథాలయంలో పుస్తకాల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. చిన్నతనం నుండే మంచి పుస్తకాలు చదువుకోవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. పుస్తకాన్ని మించిన స్నేహితుడు మరొకరు లేరన్నారు.