దేశంలోనే తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అని ప్రధాని మోదీ అన్నారు. ‘రాష్ట్రపతి పదవికి ఆమె పేరును ప్రతిపాదించగానే భారీ మెజార్టీతో గెలిపించాలని బిహార్ CM నితీశ్ పిలుపునిచ్చారు. PM జన్మన్యోజన ద్వారా పనుల ప్రారంభ ఘనత ముర్ముదే. ఈ పథకం ద్వారా రూ.24వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ముర్మును రాష్ట్రపతిని చేయడం NDA అదృష్టంగా భావిస్తున్నా. గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల సంక్షేమాన్ని మరిచాయి’ అని పేర్కొన్నారు.