NRML: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ సాధనకు ఐక్యంగా ముందుకు వెళ్దామని జేఏసీ చైర్మన్ జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావలసిన డీఏలు, పదోన్నతులు సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు.