ప్రకాశం: ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రెవెన్యూ సమస్యను అధికారులు పట్టించుకోవడంలేదని అద్దంకికి చెందిన సాదు కోటేశ్వరరావు ఆరోపించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని కొన్ని ఏళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టనట్టుగా ఉంటున్నారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం హద్దులు పెట్టడానికి కూడా అధికారులు రావడం లేదని చెప్తున్నారు.