TG: ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్‌ను అధిగమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గతంలో కోటి 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉండేదని అన్నారు. ప్రస్తుతం కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉందన్నారు. అలాగే, సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించినట్లు తెలిపారు. సన్న ధాన్యానికి బోనస్ ప్రకటించడం వల్ల ఉత్పత్తి పెరిగిందని చెప్పారు.