AP: గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో అర్థం కావడం లేదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే జరిగిందన్నారు. దేనికీ సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవన్నారు. గత ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లులు కూడా పెండింగ్లో పెట్టారని ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్ చేయక కళాశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని అన్నారు.