AP: శాసనమండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా మండలిలో రగడ మొదలైంది. కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపుపై ప్రభుత్వ విధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రచారం చేసిందే తప్ప కాలేజీలు కట్టలేదని మండిపడ్డారు. చర్చ సందర్భంగా వాగ్వాదం జరగటంతో వైసీపీ సభ్యులు మండలి నుంచి వెళ్లిపోయారు.