ప్రకాశం: చినగంజం మండల పరిధిలో ఉన్న సముద్ర తీరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై రమేష్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా బందోబస్తుకు విచ్చేసిన పోలీసులకు పలు సూచనలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానానికి విచ్చేసిన భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.