దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరాదిన గంగా ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. అయోధ్యలోని సరయూ స్నాన ఘట్టాల వద్ద భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం బారులు తీరారు. వారణాసిలోనూ దేవ్ దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు.