కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు, శ్రీమహా విష్ణువుల అనుగ్రహం పొందేందుకు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అందుకే ఈ రోజున శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. ఉత్తర భారతదేశంలో దేవ దీపావళి అని.. అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు.