NRML: ఖానాపూర్ మండలం బావాపూర్(R)గ్రామ సమీపంలో రెండు గేదెలపై పెద్దపులి దాడి కలకలం రేపిన ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ పశువులను మేపడానికి అడవికి తీసుకెళ్లారు. పెద్దపులి దాడి చేసిందని, భయపడిన రైతులు కేకలు వేశారు. దీంతో పులి అక్కడి నుండి పారిపోయిందని, అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.