ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయం మరో రికార్డు సాధించేందుకు సిద్ధమైంది. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా రికార్డు స్థాయి సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చి, సరయూ నదిలో పుణ్యస్నానాలు చేసి తరించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా నిర్వహించనున్నారు.