భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ దాదాపు సంవత్సరం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున షమీ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ షమీ బాగా బౌలింగ్ చేసిన తర్వాత వాపు, నొప్పి లేకుంటే ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.