భారత్‌లో ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 42.373 కోట్లు ఉండగా.. 2028 కల్లా 45.762 కోట్లకు చేరొచ్చని అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్‌నౌ తన నివేదికలో వెల్లడించింది. అంటే నికరంగా ఉద్యోగుల సంఖ్య 3.38 కోట్ల మేర పెరుగుతుందన్నమాట. కొత్త సాంకేతికతలు నైపుణ్యాల్లో తీసుకొస్తున్న మార్పులతో భారత్‌కు చెందిన కీలక వృద్ధి రంగాలు 2028 కల్లా 27.30 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలను సృష్టిస్తాయని నివేదిక తెలిపింది.