AP: అమరావతిలో RTGSపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజల సమగ్ర డేటా అనుసంధానంతో మెరుగైన పౌర సేవలు అందుతాయని తెలిపారు. అర్హులకే పథకాలు అందేలా ఆర్టీజీఎస్ ఉపయోగపడాలని అధికారులకు సూచించారు. పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇవ్వాలని ఆదేశించారు. త్వరలో వాట్సాప్ ద్వారా వంద పౌర సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.