AP: అనంతపురం జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త జింకల రామాంజిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఈనెల 21 వరకు రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.