సాధరణంగా రాత్రిళ్లు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు మంచి కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు పీడకలలు వస్తుంటాయి. కానీ మనం నిద్రలేచాక ఆ కలలేవీ గుర్తుండవు. కలలు మన ప్రవర్తన, ఆలోచనను బట్టి వస్తుంటాయి. మనం నిద్ర లేచి ఉలిక్కిపడిన మరుక్షణం మన బాడీ యాక్టివ్ అవుతుంది. అలాగే నిద్రలో ఉన్నపుడు మెదడులో ఓ కీలకమైన రసాయనం తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే మనకు కలలు గుర్తుండవని నిపుణులు చెప్తున్నారు.