AP: ఉద్యానపంటలకు పెద్దఎత్తున ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఉద్యాన పంటలకు రాయితీలు, ప్రయోజనాలపై గ్రామసభలో ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పంటలకు కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. రైతులకు రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింకర్లు పంపిణీ చేస్తామని చెప్పారు. త్వరలోనే ఊరూరా గ్రామసభలు పెట్టి ఉద్యాన పంటలపై ప్రచారం చేస్తామన్నారు.