కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ దీపావళి కానుకగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తనతో ఉన్నవాళ్లంతా ‘దీపావళికి పెద్ద సినిమాలు వస్తాయి.. నీ సినిమా చూడటానికి ఎవరొస్తారు.. అవసరమా?’ అని విమర్శించారని కిరణ్ అబ్బవరం తెలిపాడు. ఎక్కడికి వెళ్లినా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నాడు. ‘నేను పెద్ద స్టార్ కాకపోవచ్చు.. కానీ ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు.. ఒక శుక్రవారం అంతా మార్చేస్తుంది’ అని స్పష్టం చేశాడు.