MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు నేడు ఆందోళన నిర్వహించారు. సీపీఐ పార్టీ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ యూనియన్‌తో కలిసి ఆశ వర్కర్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని కలిసి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వినతిపత్రం సమర్పించారు. అజయ్ సారధి రెడ్డితో పాటు సభ్యులు పాల్గొన్నారు.