వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ అతిథ్యం ఇవ్వనుంది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహించేందుకు పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీటిని పాకిస్థాన్ ఖండించింది. ‘హైబ్రిడ్ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. వేదికలపై ఇంకా మా నిర్ణయం వెల్లడించలేదు. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నాం’ అని పీసీబీ వెల్లడించింది.