PDPL : ఈనెల 10న పెద్దపల్లి జిల్లాలో అఖిలభారత యాదవ మహాసభ, యువజన విభాగం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓదెల మండలంలో యాదవ కులస్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని మండల అధ్యక్షుడు కావటి రాజు యాదవ్ పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారి పెద్దపల్లి జిల్లాలో యాదవ కులస్తులు ప్రతిష్ఠాత్మకంగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలన్నారు.