AP: వర్రా రవీంద్రారెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు మీదుగా తెలంగాణ పారిపోతుండగా అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేసి కడప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా వర్రా రవీంద్రారెడ్డి ఉన్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంతో పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి.