TG: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన దిశా కమిటీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసినా అనేక రాష్ట్రాల్లో అమలు కావడం లేదని చెప్పారు. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వచ్చినా జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌కు నిధుల కొరత ఉందని పేర్కొన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.